![]() |
![]() |
.webp)
స్టూడెంట్స్ కాలేజీ లైఫ్ లో ఎంతో ఎంజాయ్ చేసి బాగా మార్కులు తెచ్చుకొని విదేశాలలో సెటిల్ అవ్వాలనుకునే వారికోసం సుమ కొన్ని టిప్స్ ఇస్తోంది. అమెరికా వెళ్లి అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి మంచి జాబ్ తెచ్చుకొని అక్కడే ఉండాలనుకుంటే కొన్ని ఫాలో అవ్వాల్సిందేనంటోంది సుమ.
బాగా చదివేవారికి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. పీజీ, ఎంబీఏ చేసి టోఫెల్ , ఐఎల్ట్స్ రాసి అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటారు. అయితే అక్కడికి వెళ్ళి చదువుకోవడమంటే మాటలు కాదు. ఎంతో శ్రమించాలి.. ఇక్కడ వీసా రావాలి ఫస్ట్. ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. సరైన కాలేజీలో సీటు రావాలి.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ దాటుకొని అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ చాలా చిన్నచూపు చూస్తారు. అక్కడికి వెళ్ళిన తెలుగు యువత కష్టాలు మాములుగా ఉండవంటు సుమ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసింది. అందులో మన తెలుగు వాడు అమెరికాలో అనుభవిస్తున్న బాధలని చెప్పుకొచ్చాడు. పొద్దున్నే లేచి బట్టలు ఉతుక్కోవాలి.. వంట చేసుకోవాలి.. గిన్నెలు తోముకోవాలి. కాలేజీకి వెళ్ళాలి.. అ తర్వాత పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవాలి.. ఎప్పుడో రాత్రి ఇంటికి వస్తే సరైన ఫుడ్ ఉండదంటు అమెరికాలో చదువుకుంటున్న స్టూడెంట్స్ చెప్పగా.. అవన్నీ కష్టాలు కాదు.. చిన్నప్పటి నుండి మీ అమ్మ మీ కోసం చేసిన శ్రమ, మీ చేత్తో చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీ అమ్మ ఇక్కడికి పంపిందని సుమ చెప్పింది.
ఇండియా నుండి అమెరికాకి వస్తున్న వారికోసం మీరిచ్చే సలహా ఏంటని సుమ అడుగగా.. రావాలనుకునేవారు రండి. దూలతీరిపోద్ది.. నాలాగే మీరు కూడా బలవ్వాలి కదా అని అతను అన్నాడు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలోని యువత ఎక్కువగా అమెరికాకి వెళ్లినట్టు ఓ సర్వేలో తేలింది. అయితే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో సుమ మరియు అక్కడ ఉండే తెలుగు యువకుడు కళ్ళకి కట్టినట్టు చెప్పారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. సుమ సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ కంటెంట్ ని ఎక్కువగా చేస్తుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సుమకి ఇన్ స్టాగ్రామ్ లో 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
![]() |
![]() |